కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preeth Singh ) .ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.
సందీప్ కిషన్ రకుల్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన ఈమె నటించారు.అదేవిధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకొని ఓ వెలుగు వెలిగారు.ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరస సినిమాలలో నటిస్తున్నారు.ఈమె 2014వ సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.అయితే ఈ ఏడాదికి ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి కావడంతో అభిమానులు రకుల్ ప్రీత్ సింగ్ కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇలా పదేళ్లు పూర్తి కావడంతో ఈమె బాలీవుడ్ సినిమా ముచ్చట్లు గురించి అభిమానులతో పంచుకున్నారు.తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంఎస్ ధోనీ( MS Dhoni ) : అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో మొదట అవకాశం వచ్చిందని అయితే టాలీవుడ్ స్టార్ హీరోల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది అంటూ రకుల్ తెలియజేశారు.ఈ సినిమా అవకాశం తనకు వచ్చినప్పుడు తాను అల్లు అర్జున్ ( Allu Arjun ) తో సరైనోడు ఎన్టీఆర్ ( Ntr ) తో నాన్నకు ప్రేమతో రామ్ చరణ్ ( Ramcharan ) తో ధ్రువ సినిమాలో నటిస్తూ ఉన్నానని తెలిపారు.
ఈ సినిమాలు చేస్తూ ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాని పక్షంలో ఆ సినిమాని వదులుకున్నానని ఆ సినిమా కనుక చేసి ఉంటే తన కెరియర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోలా ఉండేది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.