మీరు USలో అద్దెకు ఇల్లు తీసుకుందామని చూస్తున్నారా? నిజానికి అమెరికాలో( America ) రెంటిల్లు దొరకడం చాలా కష్టం.అది కూడా సరసమైన ధరల్లో ఉత్తమమైన ప్రదేశంలో రెంట్ హౌస్( Rental House ) కనుగొనాలంటే దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.
చాలా మంది ప్రజలు కొనుగోలు చేయడానికి బదులుగా అద్దెకు ఎంచుకుంటారు.అద్దెదారులకు కొన్ని యూఎస్ నగరాలు ఉత్తమమైనవిగా నిలుస్తున్నాయి.2024లో ఈ నగరాలలో ఇళ్ళు చాలా అందమైన, ఫ్రెండ్లీ వాతావరణాన్ని అందిస్తున్నాయి.అవి ఏవో చూద్దాం.
• అట్లాంటా
మోడర్న్ మిడ్‌టౌన్ అట్లాంటాలో( Atlanta ) గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి.అద్దెదారులు ఈ ఫ్రెండ్లీ సౌత్ సిటీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.2023లో RentCafe.comలో అట్లాంటా అపార్ట్‌మెంట్లపై ఎక్కువ ఆసక్తి చూపారు.

• కాన్సాస్ సిటీ
ఈ సిటీలో లివింగ్ కాస్ట్( Living Cost ) చాలా తక్కువగా ఉంటుంది.పైగా అనేక ఉద్యోగాలను ఇక్కడ ఈజీగా పొందవచ్చు.అద్దె కూడా తక్కువే.అద్దెదారులు 2023లో KCMO జాబితాల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.
• సిన్సినాటి
అందమైన నదీతీరం సిన్సినాటి నగరం.( Cincinnati ) అనేక ఉద్యోగాలు, గ్రీనర్ లుక్‌తో ఈ సిటీ నివసించేందుకు బెస్ట్గా నిలుస్తుంది.అద్దెదారులు 2023లో రెంటల్స్ కోసం ఎక్కువ వెతికారు.వారు మరిన్ని ప్రాపర్టీలను కూడా ఇష్టపడ్డారు.సిన్సినాటి ఒక ఆకర్షణీయమైన మిడ్ వెస్ట్రన్ సిటీ.

• అర్లింగ్టన్
ఈ నగరం దేశ రాజధానికి దగ్గరగా ఉంది, అక్కడికి చేరుకోవడం సులభం.ఆర్లింగ్టన్( Arlington ) అద్దెదారులకు టాప్ ఛాయిస్ అవుతోంది.దీనిని కూడా మీరు పరిగణించవచ్చు.
• ఓర్లాండో
ఓర్లాండోలో( Orlando ) మనోహరమైన సన్‌లైట్ ఉత్సాహాన్ని నింపుతుంది.ఓర్లాండోలో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి, తక్కువ పన్నులు వసూలు చేస్తారు.ఇదొక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.

• మిన్నియాపాలిస్
మిన్నియాపాలిస్( Minneapolis ) పట్టణ ఆకర్షణ, మంచి జీవన ప్రమాణాలను కలిగి ఉంది.
• పోర్ట్‌ల్యాండ్
పోర్ట్‌ల్యాండ్‌లో( Portland ) కూడా ఇల్లు రెంటర్లకు ఉత్తమంగా నిలుస్తున్నాయి.







