సాధారణంగా హీరోయిన్ అనగానే మనకు ముందుగా అందమే గుర్తుకు వస్తుంది.ఎందుకంటే హీరోయిన్ స్వతహాగా అందంగా కనిపిస్తుంది.
అంతేకాదు మేకప్ వేసుకుని బుట్టబొమ్మ లాగా తయారై ఆకర్షిస్తుంది.అందమైన కాస్టమ్స్లో మెరిసిపోతుంది.
ప్రతి ఒక్కరికి డ్రీమ్ గర్ల్ గా నిలుస్తుంది.అయితే హీరోయిన్ అనగానే అందంగా కనిపించాలనే భావనను తప్పు అని కొందరు నిరూపించారు.
వారు కావాలనే ప్రత్యేకమైన మేకప్ వేసుకొని అందవిహీనంగా కనిపించారు.అలా కనిపించినా ప్రేక్షకులను అలరించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు.
ఆ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
• ఐశ్వర్య రాజేష్
సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు అయిన ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో డీగ్లామర్ రోల్ చేసి బాగా ఆకట్టుకుంది.
ఈ మూవీలో విజయ్‌తో ఈ తార రొమాన్స్ చేసింది.ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.దీనికంటే ముందు కౌసల్యా కృష్ణమూర్తిలో కూడా ఐశ్వర్య డీగ్లామర్ క్యారెక్టర్ చేసి మెప్పించింది.
• ప్రియమణి
మణిరత్నం డైరెక్ట్ చేసిన విలన్ మూవీలో ప్రియమణి( priyamani ) ఎలాంటి మేకప్ వేసుకోకుండా కనిపించింది.
మేకప్ వేసుకోకపోయినా ఆమె అందంగానే ఉంది.కానీ కొన్ని సన్నివేశాల్లో కావాలనే అందవిహీనంగా తయారై కనిపించింది.
ఈ మూవీలో ఆమె హీరో విక్రమ్‌కి చెల్లెలుగా నటించింది.ఇందులో ఐశ్వర్య రాయ్ కూడా యాక్ట్ చేసింది.
• సమంత
రంగస్థలం సినిమాలో రామలక్ష్మి వంటి డీగ్లామర్ రోల్లో అగ్రతార సమంత( samantha ) యాక్ట్ చేసింది.నిజానికి ఈ రోల్ ఒప్పుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.అయితే సమంత ఈ పాత్రలో చాలా చక్కగా నటించి అందర్నీ ఆకట్టుకుంది.సమంత కెరీర్లో రామలక్ష్మి పాత్ర చాలా స్పెషల్ గా నిలిచిపోయింది.
• తమన్నా
మిల్కీ బ్యూటి తమన్నా( Tamannaah ) అభినేత్రి, బాహుబలి రెండు సినిమాల్లో మామూలు అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది.అభినేత్రి మూవీలో ఓ పల్లెటూరి భార్యగా సాదాసీదా పాత్రలో చేసి మెప్పించింది.బాహుబలిలో కూడా డీగ్లామర్ రోల్ చేసింది.
• అనుష్క శెట్టిచాలా అందంగా చందమామ లాగా కనిపించే అనుష్క శెట్టి( Anushka Shetty ) బాహుబలి సినిమాలో మాత్రం ముసలామెడి లాగా కనిపించి షాక్ ఇచ్చింది కానీ ఆమె చేసిన పాత్ర దేవసేన బాగానే పండింది.ఒక పార్ట్‌లో అనుష్క ముసలమ్మ లాగా, మరొక పార్ట్‌లో యువరాణి లాగా కనిపించి అలరించింది.ప్రేమఖైదీలో అమలాపాల్, సానికాయిదంలో కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ పాత్రల్లో యాక్ట్ చేసి మెప్పించారు.