రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.హైదరాబాద్ విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

 Chief Minister Revanth Reddy Congratulated The People Of The State On Sankranti,-TeluguStop.com

వీకెండ్ కావటంతో పాటు పండుగ రావటంతో హైదరాబాద్ విజయవాడ మధ్య రహదారులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.చాలామంది స్వస్థలాలకు వస్తున్నారు.

తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి సంక్రాంతి( Sankranthi ).ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.భోగి, సంక్రాంతి, కనుమ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

ఇంటింటా కొత్తగా కాంతులు వెళ్లివిరియాలని.సూర్యుని కొత్త ప్రయాణం నూతన మార్పునకు నాంది పలకాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని కోరారు.

ప్రజా హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.

డిసెంబర్ 7వ తారీకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపెద్ద పండుగ సంక్రాంతి రావడంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.ఈరోజు మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్( Piyush Goyal ) నీ కలిశారు.

విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌరసరఫరాల బకాయిలు, హైదరాబాద్ నాగపూర్.క్యారిడార్ కు అనుమతులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube