భూమిక ( Bhumika ) పరిచయం అవసరం లేని పేరు నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించినటువంటి భూమిక కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఎంతోమంది స్టార్ హీరోలకు వదిన అక్క పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈమె మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ ( Restaurent Business ) లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూనే మరోవైపు ఎన్నో బిజినెస్లను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆలస్యంగా అయినప్పటికీ భూమిక కూడా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు.

ఇక ఈమె తన రెస్టారెంట్ గోవా ( Goa ) లో ప్రారంభించారని విషయం మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా ఈమె కూడా గోవాలోనే ఉంటూ ఈ వెకేషన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం భూమిక గోవా వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.భూమిక పాతికేళ్ల పడుచు పిల్ల మాదిరిగా పొట్టి డ్రస్సులు ధరించి థైస్ అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అదేవిధంగా గోవాలో చాలా పీస్ ఫుల్ గా చిల్ అవుతూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె అభిమానులతో పంచుకోవడంతో ఎంతోమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఈమె హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమాని గుర్తు చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈమె నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ అందం మాత్రం తగ్గడం లేదని వయసుతోపాటు అందం కూడా పెరుగుతుంది అంటూ ఈ ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.ఇక భూమిక సినిమాల విషయానికి వస్తే ఈమె చివరిగా సీతారామం సినిమాలో కనిపించి ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు వస్తే కనుక ఈమె ఆ సినిమాలను ఎంపిక చేసుకొని నటిస్తున్న సంగతి తెలిసిందే.







