త్రివిక్రమ్( Trivikram ) రాసే రాతల్లో చాలా లోతు ఉంటుంది.ప్రతి సినిమా సినిమాకి ఏదో ఒక హింట్ ఇస్తూ ఏదో ఒక రకంగా కనెక్షన్ ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటాడు.
ఒక సినిమాలో యుద్ధం చేసేవాడు గొప్ప కాదు రాకుండా ఆపుతాడే వాడే గొప్ప అని చెబుతాడు.ఇంకొక చోట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నీకు తెలియాలి అని చెబుతాడు.
మరొకచోట గొప్ప గొప్ప యుద్ధాలు అన్ని నా అనుకున్న వాళ్ళతోనే అని చెబుతాడు అంటే శత్రువులు బయట ఎక్కడ ఉండరు అంతా మన చుట్టుపక్కలే ఉంటారు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు.
బాధలో ఉన్న వ్యక్తిని బాగున్నావా అని అడగడం అమాయకత్వం బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగటం అనవసరం అని అంటూ ఉంటాడు.కానీ అతడే బాగుండటం అంటే బాగా ఉండటం కాదు నలుగురితో ఉండడం అంటూ నవ్వుతూ చెప్పేస్తూ ఉంటాడు.అందుకే త్రివిక్రమ్ స్టైల్ మరెవరికి పోలిక దొరకదు వేరే భాషల్లో ఉన్న వారిని కూడా త్రివిక్రమ్ తో పోల్చడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి( Tollywood Industry ) మాత్రమే దొరికిన ఒక ఆంటీ త్రివిక్రమ్ అతడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అత్యంత అరుదైన పాత బంగారం లాంటి వ్యక్తి వాటికి విలువ కట్టలేని పూర్వ వైభవాన్ని సినిమాకు తీసుకొస్తాడు.
త్రివిక్రమ్ మాటలు మాత్రమే కాదు ఆయన తీసుకునే పాత్రలు కూడా దాదాపు అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటాయి.ఉదాహరణకు ఖలేజా సినిమాలో( Khaleja ) అనుష్క పాత్ర, నువ్వే నువ్వే సినిమాలో( Nuvve Nuvve Movie ) శ్రీయ పాత్ర, అ ఆ సినిమాలో సమంత పాత్ర( Samantha ) ఈ మూడు చాలా అమాయకంగా ఉంటాయి గొప్పింటి వారై ఉంటారు.అతడు సినిమాల్లో అత్త మీద ప్రేమను చూపిస్తాడు, అలాగే అమ్మ మీద ప్రేమను చూపిస్తాడు, ఆవకాయ కారాన్ని ప్రేమిస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు.
పంచులతో, ప్రాసలతో, రైటింగ్ తో జనాలకి మత్తు ఎక్కిస్తాడు.అతను ఎక్కించే డ్రగ్ ఎలా ఉంటుంది అంటే దాని నుంచి బయటకు రావడానికి ఒక్కోసారి కొన్నేళ్లు పడుతుంది.నక్సలిజం… ఫ్యాక్షనిజం.త్రివిక్రమ్ ఇజం. అదే నిజం.అన్నీ కలిపి అందమైన స్క్రీన్ ప్లే గా మార్చి మన వైపు విసిరేస్తాడు అతని సినిమాల్లో మతం కులం కూడా ఉంటుంది మానవీయ కోణం నుంచి సామాజిక కోణం వరకు ఉంటుంది.అతని సినిమాలు చూశాక అలా రెండు చేతులను జేబుల్లో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లడమే ప్రతి ఒక్క అభిమాని చేసే పని.