అశ్విని శ్రీ.( Ashwini Sree ) గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
ఇటీవలే తెలుగులో ముగిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి( Bigg Boss 7 ) వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని సంపాదించుకుంది అశ్విని.ఇక హౌస్ లో టాస్కులతో ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ తన అందచందాలతో మాత్రం మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని శ్రీ టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.తాను గబ్బర్ సింగ్‌లో( Gabbar Singh ) నటించిన సమయంలో పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది.ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది.పవన్ ఓజీ సినిమా( OG Movie ) హిట్ కావాలని ఆమె కోరుకుంది.పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది అశ్విని.

పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను.షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు.సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు.అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు.ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.
ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు.అందుకే పవన్ అంటే ఇష్టం అని తెలిపింది అశ్విని.







