టాలీవుడ్ యంగ్ హీరో నితిన్( Nithin ) ఇటీవల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra ordinary man) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో నితిన్ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన ప్రస్తుతం వేణు శ్రీరామ్ ( Venu Sriram ) డైరెక్షన్లో తమ్ముడు( Thammudu ) అనే టైటిల్ తో ఓ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు.
ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీలోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు.
అక్కడ భారీ యాక్షన్ సన్నీ వేషాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ విధంగా ఈ సినిమాలోని యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో హీరో నితిన్ గాయాల పాలయ్యారు.ఈయనకు గాయాలు కావడంతో వెంటనే చిత్ర బృందం షూటింగ్ క్యాన్సిల్ చేశారు.ఈ ప్రమాదంలో నితిన్ చేతికి గాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే హీరోని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా ఈయనని పరీక్షించిన డాక్లర్లు మూడు వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి.

ఇక ఈ విషయం తెలిసి అభిమానులు కంగారుపడుతున్నారు.మరి కొంతమంది ఈయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.ఇక ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో రావడంతో సినిమాపై అంచనాలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా ఈ సినిమా అక్క తమ్ముడు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలోనే ఈ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి నితిన్ కు ఈ సినిమా అయినా సక్సెస్ అందించేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.







