ప్రియాంక సింగ్ (Priyanka Singh) పరిచయం అవసరం లేని పేరు జబర్థస్త్ (Jabardasth) కార్యక్రమంలో సాయిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తను లేడీ క్యారెక్టర్స్ లో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈమె లేడి క్యారెక్టర్స్ లో నటిస్తూ అలాగే లింగ మార్పిడి చేయించుకుని సాయిగా ఉన్న తను కాస్త ప్రియాంక సింగ్ గా మారిపోయారు.
ఇలా ఈమె ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో అందంగా తయారయ్యారు.ఈ క్రమంలోనే తను బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని కూడా అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున అందరిని సందడి చేసినటువంటి ప్రియాంక ప్రస్తుతం ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.బుల్లితెరపై ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నటువంటి సమయంలో ఈమె కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా ఆమె కొత్త కారును(New Car) కొన్నారని తెలుస్తోంది.

ఈ వీడియోలో ఈమె హుంద్యాయ్ షో రూమ్ లోకి వెళ్లి కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా పూర్తిచేసి కొత్త కారును అందరికీ చూపించారు.ఈమె హుంద్యాయ్ వెర్న్ ఎస్ ఎక్స్( Hyundai Verna SX Car ) కారును కొనుగోలు చేశారు.ఈ కారుకు ప్రియాంక పూజలు చేసి అనంతరం కారులో డ్రైవ్ చేస్తూ వెళ్లారు ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె 13 సంవత్సరాల తన కల కష్టం నేటితో నెరవేరింది అంటూ ఈమె కారు కొన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమెకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







