ఏందయ్యా ఈ కర్మ .తెలుగు సినిమాల్లో తెలుగు వచ్చిన వాళ్ళు ఒకరు ఉండరా ? రాను రాను మన భాష ఎక్కడికి పోతుంది .సినిమా ఇండస్ట్రీలో పోకడలు పూర్తిగా ఇంత అధ్వానంగా మారిపోతే ఇక సినిమాల్లో నటించాలనుకుని ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వస్తున్న వాళ్లకు ఏం అవకాశాలు దొరుకుతాయి.తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త కనిపిస్తుంది సైంధవ సినిమాలో వెంకటేష్ తప్ప మిగతా అందరూ పరభాష నటులే.
మొన్న ఒక బూతు వెబ్ సిరీస్( Web series ) చేసి పరువు పోగొట్టుకున్న వెంకటేష్( Venkatesh ) సైంధవ సినిమాతో పెద్ద బజ్ అయితే మూట కట్టుకోలేదు కానీ ఇలాంటి ఒక అపవాదును నెత్తికెక్కించుకుంటున్నాడు.మన తెలుగు సినిమాల్లో నటీనటులకు ఏం తక్కువ చెప్పండి డబ్బులు కూడా ఎక్కువ డిమాండ్ చేయరు.
ఎంత ఇస్తే ఎంత తీసుకుంటారు.

చైల్డ్ ఆర్టిస్ట్ ( child artist )నుంచి ముసలి పాత్ర వరకు అందరూ నార్త్ ఇండియన్స్ కావాలి అని ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తెచ్చుకొని ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ అంటూ కోట్లకు కోట్లు బడ్జెట్ పెంచడం తప్ప దీని వల్ల వచ్చే ఒక్క ఉపయోగం చెప్పండి.ఎవరైనా ఒకరు కొత్తగా కనిపిస్తే చాలు ఎగబడి మరి వాళ్ళనే పెట్టుకుంటారు మరి ఆ తెల్ల తోలు వారు యాక్టింగ్ రాకపోయినా పరవాలేదు కచ్చితంగా సినిమాలో ఉండాలని మన దర్శకులు కోరుకోవడంలో అర్థం ఏమాత్రం లేదు నిన్నటికి నిన్న బేబీ లో వైష్ణవి చైతన్య ఎంత చక్కగా నటించింది.డాన్సులు కూడా ఇరగదీసింది.
రావు రమేష్( Rao Ramesh ) కి ఏం తక్కువ చెప్పండి కచ్చితంగా మురళీ శర్మనే( Murali Sharma ) కావాలా ? ఎన్ని డిమాండ్స్ ఉన్నా సరే అతడినే పెట్టుకుంటారు అతడు చెప్పిందల్లా చేస్తారు కానీ తెలుగు వారికి మాత్రం అవకాశాలు ఇవ్వరు.

పైగా తెలుగులో హీరో తప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఫైట్ మాస్టర్ సైతం బయట నుంచి వస్తున్నారు.డైరెక్టర్స్ కూడా బయట నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నారు.మరి హీరో తప్ప మిగతా ఇండస్ట్రీలో అందరూ ఇక నటన మానుకోవాల్సిందేనా ? ఒక కేజీఎఫ్ ఒక పొనియన్ సెల్వం ఒక కాంతారా తీసుకోండి 24 విభాగాల్లో అందరూ అక్కడి వారే ఉంటారు వారు చేసే పని మన తెలుగు సినిమా నిర్మాతలకు దర్శకులకు ఎందుకు అర్థం కావడం లేదు.ఏం దౌర్భాగ్యం మనకు ఎన్ని రోజులు ఇంకా ఇది భరించాలి.ఒక్కసారి ఆలోచించండి… ఒక్కరైనా అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నించండి.







