విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన రైతు ఆత్మహత్యయత్నం...!

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం( Peddavoora )లోని కెకె తండా గ్రామ పంచాయతీ పరిధిలోని బావసోనిబాయి తండాకు చెందిన గిరిజన రైతు రమవత్ బల్లు(44) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని స్థానికులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 Tribal Farmer Suicide Attempt Due To Negligence Of Electricity Officials...!-TeluguStop.com

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన విద్యుత్ అధికారులు రైతు( Farmer ) బోరు మీదుగా మెయిన్ లైన్ వేశారు.

బోర్ పాయింట్ మీదుగా కాకుండా పక్క నుండి వేయాలని,బోర్ రిపేర్ అయినప్పుడు విద్యుత్ తీగలు( Electrical wires ) అడ్డువచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉందని బాధిత రైతు వేడుకున్నా విద్యుత్ ఏఈ పెడచెవిన పెట్టాడు.దీనితోచేసేదిలేక రైతు పురుగులు మందు తాగినట్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube