గోవాలో దారుణ ఘటన జరిగింది.అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును కన్నతల్లే హత్య చేసింది.
తరువాత బాలుడి మృతదేహాన్ని బ్యాగ్ లో తరలించేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలోనే గోవా నుంచి కర్ణాటక వెళ్తుండగా తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే గోవాకు వెకేషన్ కు వెళ్లిన సమయంలో ఈ దారుణ ఘటనకు పాల్పడింది.హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి సుచనా సేథ్ సాప్ట్ వేర్ స్టార్టప్ కంపెనీకి సీఈవో అని నిర్ధారించారు.
సుచనా సేథ్ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.మరోవైపు సుచనా సేథ్ కు కోర్టు ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది.