ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ కూల్చివేతలతో పాలనను ప్రారంభించారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమ.ఇప్పుడు రాయలసీమను రాళ్ల సీమగా చేశారన్నారు.టీడీపీ అధికారంలో ఉంటే కర్నూలు బాగా అభివృద్ధి చెందేదని తెలిపారు.
ఐదేళ్ల వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని విమర్శించారు.ఈ నేపథ్యంలో స్వర్ణయుగం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
స్వర్ణయుగం కావాలా.? రాతియుగం కావాలా? అని ప్రజలు ప్రశ్నించారు.







