హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేస్ రద్దుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఫార్ములా ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని అంటున్నారని పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-రేస్ పై ప్రజలు అందరికీ వాస్తవాలు తెలియాలని భట్టి విక్రమార్క తెలిపారు.ఓ కంపెనీకి లబ్ధి చేసేందుకు ఫార్ములా ఈ -రేస్ పెట్టారని మండిపడ్డారు.
ఫార్ములా ఈ -రేస్ లో ముగ్గురు వాటాదారులు ఉన్నారన్న ఆయన ఫార్ములా ఈ-రేస్ టికెట్లు అమ్ముకుని లబ్ధిపొందారని ఆరోపించారు.ఈ-రేస్ విషయంపై ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందన్నారు.
సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అనుమతి లేదని చెప్పారు.అలాగే ఈ -రేస్ వలన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదని తెలిపారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని విమర్శించారు.ఈ క్రమంలోనే ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు చేస్తామని తెలిపారు.







