కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ప్రత్యేక సమావేశం ఇవాళ జరగనుంది.ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది.కృష్ణా బోర్డు నాగార్జున సాగర్ నుంచి ఏపీకి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయడంపై కూడా తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
దీంతో కృష్ణాబోర్డు ఇవాళ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఇందులో ప్రధానంగా నాగార్జున సాగర్ తో పాటు శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై బోర్డు చర్చించనుంది.







