తెలంగాణ రాష్ట్రంలో అభయహస్తం గ్యారంటీలను చిత్తశుద్ధితో అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని పేర్కొన్నారు.
ఐదు గ్యారెంటీల కోసం కోటి ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి పొంగులేటి మొత్తం దరఖాస్తులు కోటి 25 లక్షలు వచ్చాయని చెప్పారు.ఈనెల 25వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి అవుతుందన్నారు.
నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్న ఆయన ప్రతిపక్షం నేతలు కారుకూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు.వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
వంద రోజులు ఆగితే ప్రతి డాక్యుమెంట్ ప్రజల ముందు పెడతామని తెలిపారు.







