టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గుంటూరు జిల్లాలో జరగనుంది.ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిపేందుకు నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈనెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మహేశ్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.ఖలేజా తరువాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.







