సలార్ సినిమాతో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతానికి ఒక భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఈ సినిమాతో 900 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టాడు.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉందిం కానీ ప్రభాస్ నెక్స్ట్ సినిమా అయిన కల్కి సినిమాతో తను క్రియేట్ చేసిన బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.బాహుబలి 2 సినిమా 2000 కోట్ల వరకు కలక్షన్స్ రాబట్టి ఇండియాలోనే అత్యధిక కలక్షన్లను రాబట్టిన సినిమాగా బాహుబలి 2( Baahubali 2 ) నిలిచింది.
ఇక ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి చాలా సినిమాలు ట్రై చేస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా దాని దరి దాపుల్లోకి కూడా రావడం లేదంటే అతిశయోక్తి కాదు…అయితే మరోసారి ప్రభాస్ కల్కి సినిమా( Kalki Movie )తో ఈ రికార్డును బ్రేక్ చేస్తారంటూ పలువురు సినీ మేధావులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ మ్యాన్ గా మనకు కనిపించబోతున్నాడు అనేది ఈ సినిమా గ్లిమ్స్ లోనే మనకు అర్థమైంది.సూపర్ మ్యాన్ అవతారంలో ప్రభాస్ ని చూసిన జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) ఇప్పటికే మహానటి లాంటి ఒక సూపర్ డూపర్ సెన్సేషనల్ సినిమాను తీసి ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందాడు.

ఇక దాంతో ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ ఈ సినిమాని కూడా భారీ రేంజ్ లో తీయాలనే ఉద్దేశ్యం లోనే ఆయన ఈ సినిమాని తిస్తున్నట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి షాట్ ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది…మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే…
.







