ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలకు మాంసం లేనిదే ముద్ద దిగదని కచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే మాంసం తినేవారిలో ఎక్కువగా చికెన్( Chicken ) తినడానికే ఇష్టపడుతూ ఉంటారు.
ఎందుకంటే ఈ రోజులలో ఎక్కువగా చికెన్ లో చాలా వెరైటీస్ వచ్చాయి.వాటి వల్ల కూడా చికెన్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ పెరిగింది.
అయితే ఎక్కువగా చికెన్ తినడం మంచిది కాదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే చికెన్ తినడం వల్ల లాభమా? నష్టమా? రెడీమేడ్ అంటే ఏమిటి? వైట్ మీట్ అంటే ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తినే ఆహారంలో అయితే కొన్ని జాగ్రత్తలు మనం కచ్చితంగా తీసుకోవాలి.ఏది అతిగా తిన్నా కూడా అనారోగ్యమే.అయితే అనారోగ్య సమస్యలు( Health Problems ) తెచ్చుకోవడానికి ముందు కొంచెం అవగాహన పెంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. డీప్ ఫ్రై( Deep Fry ) చేసిన చికెన్ ను, అలాగే ఫ్రై చేయడానికి ఉపయోగించిన ఆయిల్ ను మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం వల్ల వండిన చికెన్ ను తినడం వల్ల క్యాన్సర్( Cancer ) వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలలో తెలిసింది.
దీని పై శాస్త్రవేత్తలు కూడా అధ్యయనాలు చేశారు.

ముఖ్యంగా గుడ్డు మాంసం అంటే గొర్రె, పంది మాంసం తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.అలాగే చికెన్, చేపలు, రొయ్యల్లో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholestrol ) స్థాయి పెరుగుతుంది.
అలాగే మనం చికెన్ ను ఎలా పడితే అలా వండితే అనారోగ్యానికి దారికి ఇస్తుంది.ఫ్రైడ్ చికెన్ కంటే కూడా ఉడికించిన చికెన్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ చికెన్ కంటే కూడా మీకు చేపలు( Fish ) ఇష్టమైతే ఇంకా మంచిది.చేపలు తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.







