Aamir Khan :వావి వలసలు లేని వీళ్లు జనాలకు ఇలాంటి సందేశం ఇస్తున్నారు.. వీరింట్లో పెళ్లి చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి ?

ఒక కుటుంబం అంటే ఏంటి చెప్పండి ? అమ్మ నాన్న, వారికి ఒక ఇద్దరు పిల్లలు, ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఇంట్లో ఉన్న పెద్దవారు, పిల్లలకు పెళ్లి అయితే ఆ వారి పిల్లలు …ఇలాగే ఉంటుంది ఏ కుటుంబం అయినా కూడా.కానీ నీ భార్య నీ పిల్లలు, నా భర్త నా పిల్లలు, మన ఇద్దరికి మళ్ళీ పిల్లలు ఇదే సాంప్రదాయం ప్రస్తుతం బాలీవుడ్( Bollywood ) లో కోరలు విప్పుకొని అత్యంత దారుణమైన పరిస్థితిలో కనిపిస్తుంది.

 Bollywood And Their Dirty Culture-TeluguStop.com
Telugu Aamir Khan, Bollywood, Bollywood Dirty, Dirty, Ira Khan-Telugu Top Posts

నిన్నటికి నిన్న అమీర్ ఖాన్( Aamir Khan ) తన ఇద్దరు భార్యలతో సన్నిహితంగా ఉంటూ కూతురు ఐరా ఖాన్( Ira Khan ) వివాహం చేశాడు వీరి కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంది అంటే అమీర్ ఖాన్ పెద్ద కు పెద్ద భార్యకి ఇద్దరు పిల్లలు, చిన్న భార్య కి ఒక కొడుకు.వీరందరూ కలిసి పెద్ద భార్య కూతురు పెళ్లికి హాజరై కలిసి డ్యాన్సులు చేస్తారు పెళ్లి విందును ఆరగిస్తారు.కానీ చూసేవారికి ఇలాంటి పెళ్లిళ్లు, ఇలాంటి కుటుంబాల వల్ల ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న.

Telugu Aamir Khan, Bollywood, Bollywood Dirty, Dirty, Ira Khan-Telugu Top Posts

ఆ భార్య పిల్లలు ఈ భార్య పిల్లలు రాసుకుని తిరుగుతారు.కలిస్తే కౌగిలించుకొని మాట్లాడుకుంటారు.విందు వివాహాల్లో పాల్గొంటారు.

కానీ ఎవరికి ఎవరు ఏమవుతారు అనే ప్రశ్న పెద్ద చెక్కుముడి.ఇలాంటి సంస్కృతి బాలీవుడ్ లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది.

మొన్నటికి మొన్న సైఫ్ అలీ ఖాన్ కూడా పెద్ద భార్య, చిన్న భార్య, ఆ భార్య పిల్లలు ఈ భార్య పిల్లలు.ఇలా అందరూ కలిపి ఒక కుటుంబం.

తండ్రి పెళ్లికి కూతురు వస్తుంది కూతురు బాయ్ ఫ్రెండ్ తో తండ్రి తిరుగుతాడు.ఇలా ఒక విష సంస్కృతిని ప్రపంచానికి రుద్దుతూ పిల్లల మెదడును పాడు చేస్తూ అసలు ఇండియా కల్చర్ దెబ్బతీస్తూ మన సంస్కృతి మనుగడమే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

Telugu Aamir Khan, Bollywood, Bollywood Dirty, Dirty, Ira Khan-Telugu Top Posts

ఈ సంస్కృతి కేవలం బాలీవుడ్ లో మాత్రమే ఉందా అంటే కాదు మొన్నటికీ మొన్న సింగర్ సునీతకు కొడుకు కూతురు దగ్గరుండి వివాహం చేశారు ఇక్కడ వరకు కాస్త పద్ధతి గానే ఉంది.కానీ మరీ దారుణంగా బాలీవుడ్ లోనే పరిస్థితి అద్వానంగా తయారయింది.ఈ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతూ కనిపిస్తుంది.పిల్లలకూ తల్లిదండ్రులు ఇచ్చే విలువలు పూర్తిగా పక్కన పెట్టి ఇలాంటి సంస్కృతిని వారికి అలవాటు చేస్తూ పాత పద్ధతులకు తిలోదకాలు ఇస్తున్నారు.

పైగా ఇదే మోడర్న్ కల్చర్, మెచ్యూరిటీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.రాను రాను ఇది ఎక్కువైతే ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube