ఏపీలో అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దారుణమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.
అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం దారుణమని లోకేశ్ మండిపడ్డారు.ఎస్మా ప్రయోగం, వేతనంలో కోత పెట్టడం నియంత పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం తక్షణమే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.