విదేశాల్లో యాచించేవారు ప్లకార్డులపై( Placards ) జనాలను ఆకట్టుకునే విధంగా రాతలు రాస్తారు.ఆ రాతల వల్లే తమకు ప్రజలు డబ్బు దానం చేసే విధంగా చూసుకుంటారు.
కొందరు ఏ మతం వారు ఎక్కువ డబ్బులు వేస్తారో చూద్దామన్నట్లు అన్ని మతాల పేర్లు రాసి వాటి ముందు యాచించే పాత్రలు పెట్టి అడుక్కుంటుంటారు.తమ మతం గొప్ప అని చాలామంది భావిస్తుంటారు కాబట్టి వారు తమ మతం ముందు ఉన్న పాత్రలో కచ్చితంగా డబ్బులు వేసే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా బెగ్గర్స్ తెలివిగా ఆలోచించి తమ పొట్ట నింపుకుంటుంటారు.అయితే తాజాగా ఒక ముసలాయన వీరందరికీ మించి ఒక అదిరిపోయే మనీ ఎర్నింగ్ టెక్నిక్ ఉపయోగించాడు.

“మీ గర్ల్ ఫ్రెండ్ హాట్ గా ఉందని భావిస్తే నాకు డబ్బులు ఇచ్చేయండి.” అని అతడు ఒక ప్లకార్డు పట్టుకొని రోడ్డు మీద నిలుచున్నాడు.అయితే గర్ల్ ఫ్రెండ్‌తో పాటు అటువైపుగా వెళ్ళిన వారు ఈ బోర్డ్ చూశాక డబ్బులు ఇవ్వక తప్పలేదు.ఎందుకంటే అతడికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వకపోతే తమ గర్ల్‌ఫ్రెండ్( Girlfriend ) హాట్‌గా లేదని వారంతట వారే ఒప్పుకున్నట్లు అవుతుంది.
దీనివల్ల గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అయిపోయి పెద్ద గొడవ పెట్టుకునే అవకాశం ఉంది.బాయ్ ఫ్రెండ్ ఇంత రిస్క్ చేయడని ఊహించిన సదరు ముసలాయన తన మెదడులో ఉన్న ఈ వ్యూహాన్ని అమలుపరిచాడు.
ఇది వర్కౌట్ కూడా అయింది.

ఈ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో ఒక జంట అతడు ముందు నుంచి వెళ్లడం మనం చూడవచ్చు.అయితే గర్ల్‌ఫ్రెండ్ ప్లకార్డును చదివి బాయ్ ఫ్రెండ్ కి చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ దానిని చదివిన తర్వాత ఆ ముసలాయనకి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోలేకపోయాడు.మొదటగా ఈ బాయ్ ఫ్రెండ్ అతడికి డబ్బులు ఇవ్వద్దు అనుకున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్ కోపంగా చూడడంతో వెంటనే ఒక డాలర్ నోటు అతడి ముందు ఉన్న బాక్స్ లో వేశాడు.
ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు ఇది ఒక బ్రిలియంట్ ఐడియా అని మరికొందరు పేర్కొంటున్నారు.PicturesFoIder ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఒక కోటి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దీనిని మీరు కూడా చూసేయండి.







