టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ డైరెక్టర్లలో రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) ఒకరు కాగా ఆయన డైరెక్షన్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావుకు ఎవరూ సాటిరారని చాలామంది భావిస్తారు.
ప్రస్తుతం థియేటర్లలో టికెట్ రేట్ల కంటే పాప్ కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.కొన్ని సినిమాలు సిటీలలో బాగా ఆడితే పల్లెల్లో ఆడవని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

బీ, సీ సెంటర్లలో కూడా ఆడితే సినిమాకు బెనిఫిట్ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.టైమ్ తో పాటు మనం కూడా మారాలని ఆయన కామెంట్లు చేశారు. పెళ్లిసందడి ( pelli sandadi )ఏడాది ఆడినా శ్రీకాంత్ చిరంజీవి కాడని రాఘవేంద్ర రావు అన్నారు.ఒకసారి రాజమౌళి అందంగా ఎలా చూపిస్తారని అడిగితే హీరోయిన్ల మొహం నేను చూడనని చెప్పానని వాళ్ల మైనస్ లు ఏంటో నేను చూస్తానని ఆయన కామెంట్లు చేశారు.

ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి బాగుంటాయని పూర్తిగా అందంగా ఉండేవాళ్లు ఎవరూ ఉండరని ఆయన చెప్పుకొచ్చారు.ఏవి బాగుంటాయో అవి ఎక్కువగా చూపించాలనేది ఫార్ములా అని రాఘవేంద్ర రావు కామెంట్లు చేశారు.ఎవరూ పూర్తిగా అందంగా ఉండరని ఏదో ఒక మైనస్ కచ్చితంగా ఉంటుందని ఆయన తెలిపారు.దర్శకుడు చేయాల్సిన పని కూడా అదేనని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

రాఘవేంద్ర రావు హీరోయిన్ల గురించి వర్ణించిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.రాఘవేంద్ర రావు 100కు పైగా సినిమాలను తెరకెక్కించగా ఈ జనరేషన్ డైరెక్టర్లు 20 సినిమాలను తెరకెక్కించడానికి కూడా కష్టపడుతున్నారు.రాఘవేంద్ర రావు శిష్యుడు రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.రాజమౌళి సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి పారితోషికం 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.







