ఖమ్మం నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియా గాంధీ...!!

లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో నిమగ్నం అయ్యాయి.ఈ క్రమంలోనే అధికార పార్టీ కాంగ్రెస్ సైతం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది.

 Congress President Sonia Gandhi To Contest From Khammam Lok Sabha For Next Elect-TeluguStop.com

కాంగ్రెస్ అధి నాయకురాలు సోనియా గాంధీని( Sonia Gandhi ) తెలంగాణ నుంచి లోక్ సభలో పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారన్న విషయం తెలిసిందే.

తాజాగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేసే విషయంపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది.

సోనియా ఖమ్మం( Khammam ) నుంచి బరిలో దిగనున్నారని సమాచారం.ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకులకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సమాచారం అందిందని తెలుస్తోంది.టీ.కాంగ్రెస్ నేతలు చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపగా గతంలోనే ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు.అయితే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంలో మాత్రం కాస్త సందిగ్ధత నెలకొంది.తాజాగా ఆ విషయంలో స్పష్టత వచ్చిందని విశ్వసనీయ సమాచారం.

కాంగ్రెస్ అధినాయకురాలైన సోనియా గాంధీ పోటీ చేయటం వలన తెలంగాణలోనే కాకుండా ఏపీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం( UPA Govt ) 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని( Telangana State ) ఇచ్చిన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లారు.

ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడానికి ముందే తెలంగాణ కాంగ్రెస్ తుక్కుగూడలో విజయభేరీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది.

ఈ సభలో పాల్గొన్న సోనియా గాంధీ ప్రజా పాలన అందించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగారు.

సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) నిర్వహించిన ప్రచారం, వారు ఇచ్చిన హామీలే రాష్ట్రంలో హస్తం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయని చెప్పుకోవచ్చు.దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పునర్ వైభవాన్ని పొందింది.

ఈ క్రమంలోనే సోనియాగాంధీ బ్రాండ్ ను మరోసారి ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం యోచనలో ఉంది.లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ కూడా పోటీ చేయాలని కోరుతూ రాష్ట్ర నేతలందరూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన టీపీసీసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మరోసారి సోనియా గాంధీ పోటీ అంశంపై మరోసారి కీలక చర్చ జరిగింది.

సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలంతా కలిసి మరోసారి తీర్మానం చేశారు.ఈ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా తెలంగాణ నేతలకు సోనియమ్మ సానుకూల సందేశం అందించారని తెలుస్తోంది.

రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి అంగీకరించారని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సూచించారని సమాచారం.సోనియా గాంధీ పోటీపై ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నేతలతో పాటు రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube