ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి( Chandu mondeti ) డైరెక్షన్ లో చేస్తున్న తండేల్ సినిమా( Tandel movie ) సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.అయితే ఈ సినిమా మీద నాగచైతన్య మంచి అంచనాలు పెట్టుకున్నాడు.
ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాలు ఆయన్ని నిరాశపర్చాయి.ఇక ఈ సినిమాతో మరొకసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తనకున్న ఇమేజ్ ని మరింత పెంచుకోవాలనే ఆలోచనలో నాగ చైతన్య ఉన్నట్టు గా తెలుస్తుంది.

అయితే రీసెంట్ గా ఆయన చేసిన దూత సిరీస్( dootha series ) రిలీజై మంచి సక్సెస్ ని అందుకుంది.ఇక దాంతో నాగచైతన్య ఒకసారిగా తండేల్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు.మరి ఈ క్రమంలోనే నాగచైతన్యకు తను అనుకున్నట్టు గా హిట్టు పడుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశం గా మారింది.ఒకవేళ నాగ చైతన్య తమ్ముడు అయిన అఖిల్ ( Akhil )తో పోల్చుకుంటే ఈయన కొంతవరకు బెటర్ అనే చెప్పాలి.
అఖిల్ ఇంతవరకు ఒక్కటి కూడా సరైన హిట్టు కొట్టలేకపోయాడు.కానీ నాగచైతన్య మాత్రం ఆడపదడప సక్సెస్ లు కొడుతూనే తనకంటూ ఉన్న పేరు నీ కాపాడుకుంటూ వస్తున్నాడు అలాగే ఇండస్ట్రీ లో మంచి హీరో గా ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తర్వాత ఇప్పుడు ముందుకెళుతున్న హీరో నాగచైతన్య అనే చెప్పాలి.అందుకే నాగ చైతన్య చాలా సెలెక్టెడ్ గా సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు.ఇక ఇదే క్రమంలో ఆయన 100% లవ్, మజిలీ, ఏ మాయ చేసావే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో హీరోగా నటించాడు…ఆ సినిమాలు ఇచ్చిన సక్సెస్ వల్లే నాగ చైతన్య ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు.








