యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండలకేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య( Beerla Ilaiah ) హాజరై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని,ఆ దిశగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు గ్యారెంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తునామని,ఏ పథకానికి ఎవరు అర్హులవుతారో పరిశీలించి ఆ పథకాన్ని ప్రజలకు అందిస్తామని,ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేశామని,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే వైద్య ఖర్చులకు 5 లక్షలు సరిపోవని ఆరోగ్యశ్రీ( Aarogyasri ) క్రింద పది లక్షలకు పెంచాం అన్నారు.
ప్రభుత్వం నుండి పథకాలను అందించే బాధ్యత నాదని,వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు.అనంతరం వాసవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 37 మందికి కళ్యాణాలక్ష్మి( Kalyana Lakshmi ) చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి,ఎంపీపీ తాండ్ర అమరావతి,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, తాహసిల్దార్ జలకుమారి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







