బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 రన్నర్ గా అమర్ దీప్( Amardeep ) నిలవగా బిగ్ బాస్ షో తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న అమర్ దీప్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ షో విజేతగా నిలవలేకపోయినా ఎంతోమంది మనస్సులను గెలిచానన్న మైండ్ సెట్ తో బయటకు వచ్చానని అమర్ దీప్ అన్నారు.
బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఒక ఇష్యూ వల్ల మైండ్ బ్లాంక్ అయిందని ఆయన పేర్కొన్నారు.

ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదని అమర్ దీప్ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానని అదే నా సక్సెస్ గా భావిస్తున్నానని బిగ్ బాస్ షో వల్ల నా ఫేవరెట్ హీరో రవితేజ ( Ravi Teja )గారి మూవీలో ఛాన్స్ వచ్చిందని అమర్ దీప్ కామెంట్లు చేశారు.ఇది అంతకంటే పెద్ద గెలుపు అని అనుకుంటున్నాన నా జీవితానికి అంతకంటే ఏం కావాలని అమర్ దీప్ కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షో వల్ల నాకు చాలా మేలు జరిగిందని గతంలో నేను మామూలు ఆర్టిస్ట్ నని అనుకునేవాడినని ఇప్పుడు పెద్ద స్టార్ ను అయ్యానని అమర్ దీప్ వెల్లడించారు.రవితేజ గారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.నాకు వస్తున్న మూవీ ఆఫర్లను మరికొన్ని రోజుల్లో వెల్లడిస్తానని అమర్ దీప్ పేర్కొన్నారు.అమర్ దీప్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మిస్ అండర్ స్టాండ్ వల్లే పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అరెస్ట్ జరిగిందని అమర్ దీప్ చెప్పడం కొసమెరుపు.మేము చాలా సంతోషంగా ఉన్నామని అమర్ దీప్ పేర్కొన్నారు.అమర్ దీప్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అమర్ దీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.






