2023 ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడం కోసం ఐసీసీ( ICC ) సిద్ధమైంది.మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023( Men’s ODI Cricketer Of The Year 2023 ) అవార్డు కోసం ఐసీసీ నామినేట్ చేసిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత జట్టు ఆటగాళ్లే ఉండడం విశేషం.
ఈ అవార్డు కోసం నామినేట్ అయిన వారిలో భారత జట్టు ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, శుబ్ మన్ గిల్ తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ ఉన్నారు.
ఈ అవార్డును 2004 నుంచి ప్రతి సంవత్సరం ఐసీసీ ప్రధానం చేస్తూ వస్తోంది.
ఇప్పటివరకు ఈ అవార్డు అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ( Virat Kohli ) నిలిచాడు.విరాట్ కోహ్లీ 2010, 2012, 2017, 2018 లో ఈ అవార్డు సాధించాడు.2023 లో కూడా కోహ్లీ మంచి ఫామ్ కొనసాగించి ఈ అవార్డు రేసులోకి వచ్చాడు.2023లో విరాట్ కోహ్లీ 27 మ్యాచ్లలో 1377 పరుగులు చేశాడు.ఇందులో ఆరు సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

2023 ఏడాదిలో విరాట్ కోహ్లీ 12 క్యాచ్లు పట్టుకోవడంతో పాటు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.ఇక ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ అవార్డు రేసులో ఉన్న శుబ్ మన్ గిల్( Shubman Gill ) 2023 ఏడాదిలో 29 మ్యాచులు ఆడి 1584 పరుగులు చేశాడు.
ఇందులో ఒక డబల్ సెంచరీ ఉండడం విశేషం.

ఈ అవార్డు రేసులో ఉన్న మహమ్మద్ షమీ( Mohammed Shami ) 2023 ఏడాదిలో 19 మ్యాచులు ఆడి ఏకంగా 43 వికెట్లు తీశాడు.వన్డే ప్రపంచ కప్ లో ఏడు మ్యాచ్లలో ఏకంగా 24 వికెట్లు సాధించాడు.ఈ అవార్డు రేసులో ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్( Daryl Mitchell ) 2023 ఏడాదిలో 26 మ్యాచులు ఆడి 1204 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ చేసి తొమ్మిది వికెట్లు తీశాడు.
మరి ఈ అవార్డు కోసం నామినేట్ అయిన ఈ నలుగురు ఆటగాళ్లలో ఏ ఆటగాడు ఈ అవార్డును సొంతం చేసుకుంటాడో చూడాల్సి ఉంది.







