ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె ఇక లేనట్లే...!

నల్లగొండ జిల్లా:అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( Sajjanar ) తెలిపారు.గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు( Rented bus ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు.

 The Strike Of Rtc Rental Buses Is No More...!-TeluguStop.com

ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు.వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు.

వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు.

రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు.సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్( Freebus service ) ఉంటుందన్నారు.

అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపు తామని సజ్జనార్‌ పేర్కొన్నారు.

కాగా, అంతకు ముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌( Ponnam Prabhakar )ను కలిశారు.

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube