తెలంగాణ ప్రజలు మార్పును కోరుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.కాంగ్రెస్ తోనే మేలు జరుగుతుందని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తరువాత శాసనసభ సమావేశాలను ఏర్పాటుచేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని తెలిపారు.
రాష్ట్రంలో ఆరున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ నాయకులను చూస్తే జాలేస్తుందన్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలు నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీసుకువచ్చిన పుస్తకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసి 30 రోజులు కాకముందే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.







