ఆరు గ్యారంటీలను అర్హత గల ప్రతి కుటుంబంకు అందిస్తాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హత గల అన్ని కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.రుద్రంగి మండల కేంద్రములోనీ గ్రామ పంచాయితీ ఆవరణ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సదస్సును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.

 Six Guarantees Will Be Provided To Every Eligible Family Mla Adi Srinivas, Six G-TeluguStop.com

సదస్సుకు దరఖాస్తులను అందించేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని క్షేత్రాధికారులు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఊరిలో అధికారిక ఫోగ్రాంలో పాల్గొనే అవకాశం కలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు.అలాగే ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రతి ఇంటికి చేరే విదంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.ప్రతి ఒక్కరు ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ప్రజా పాలన గ్రామ సదస్సును పరిశీలించిన అదనపు కలెక్టర్.బోయినీ పల్లి మండలం రామన్న పేట గ్రామం లో, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సదస్సును జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పరిశీలించారు.

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అర్హులందరూ దరఖాస్తులు చేసుకునేలా చూడాలని అధికారులకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube