పొత్తులపై కాంగ్రెస్ జాతీయ కమిటీదే నిర్ణయం..: ఖర్గే

ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం జరిగింది.ఇందులో ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కార్యాచరణపై నేతలు చర్చించారు.

 Congress National Committee Will Decide On Alliances..: Kharge-TeluguStop.com

భారత్ న్యాయ యాత్రను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు.

బీజేపీ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని చెప్పారు.దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఇండియా కూటమిపై దాడిని కూడా ప్రజలకు తెలపాలని పేర్కొన్నారు.

పొత్తులపై కాంగ్రెస్ జాతీయ కమిటీదే నిర్ణయమని తెలిపారు.పోల్ మేనేజ్ మెంట్ పై ముందు నుంచే జిల్లా స్థాయి నేతలు దృష్టి పెట్టాలని సూచించారు.

అన్ని సామాజిక వర్గాల ప్రజలను కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube