హీరోయిన్ రంభ.( Rambha ) ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు హీరోయిన్ రంభను ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఒకప్పుడు చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా( Star Heroine ) ఒక వెలుగు వెలిగింది రంభ.తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంతో పాటు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రంభ.సౌత్ స్క్రీన్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపింది రంభ.1990లలో అగ్ర కథానాయికగా వెలుగొందిన ఆమె 1996లో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఉనుతై అల్లిత్త సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో కార్తీక్ సరసన రంభ నటించింది.
ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది.
అయితే తమిళ్ లో తనకు మంచి కెరీర్ ను అందించిన సుందర్ సి డైరెక్షన్ లో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అరుణాచలం సినిమాలో( Arunachalam Movie ) రజనీకాంత్ పీఏగా నందిని పాత్రను రంభ పోషించింది.అయితే ఈ సినిమా షూటింగ్‌లో రజనీకాంత్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటి రంభ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ రంభ మాట్లాడుతూ.అరుణాచలం సినిమాలో నటిస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్‌తో బంధన్( Bandhan Movie ) అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటించాను.అప్పుడు ఈ రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.అందుకే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బంధన్ షూటింగ్ చేశాను.

ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు బంధన్ షూటింగ్ స్పాట్ నుంచి సల్మాన్ ఖాన్,( Salman Khan ) జాకీ ష్రాఫ్‌లు రజనీకాంత్‌ని చూసేందుకు అరుణాచలం సినిమా సెట్‌కి వచ్చారు.వాళ్లను చూడగానే మా హీరో వచ్చాడు అన్నట్టుగా నేను ఎక్కడ ఉన్నాను అన్నది మర్చిపోయి, వెంటనే వెటనే సల్మాన్ ను కౌగిలించుకుని పలకరించాను.రజనీ సార్ ఇదంతా దూరం నుంచి చూస్తున్నారు.తర్వాత రజినీ సార్, సుందర్ సి అందరూ వారితో మాట్లాడారు.ఆ తర్వాత వాళ్లు వెళ్లిన తరువాత అసలు కథ స్టార్ట్ అయ్యింది.సెట్‌లో గందరగోళం నెలకొంది.
రజనీకాంత్( Rajinikanth ) టవల్ విసిరికొట్టి ఆగ్రహంతో మాట్లాడారు.సుందర్ సి( Sundar C ) నా వైపు చూశారు.
నాకేమీ అర్థం కావడం లేదు.అప్పుడు కెమెరామెన్ వచ్చి ఏం మేడమ్ ఇలా చేశావు, ఇకపై మీతో నటించను అని రజినీ సార్ అంటున్నారు అని అన్నారు.

దాంతో నేను బోరున ఏడవసాగాను.వెంటనే నేను ఏడ్చడం చూసి రజనీసార్ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఓదార్చారు.ఆమెను ఎందుకు ఏడాపించావు అని పక్కన వారిని కోప్పడ్డారు.తర్వాత షూటింగ్ స్పాట్‌లో ఉన్న వారందరినీ పిలిచ నిలుచోబెట్టి మరీ చెప్పారు.ఉదయం సల్మాన్ ఖాన్ రాగానే రంభ ఎలా పారిపోయి కౌగిలించుకుందో ప్రాక్టికల్ గా ఆయన చేయించి చూపించారు.అదే మా సినిమా సెట్ లో అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్లిపోతానని చెప్పి వాళ్ల సినిమా హీరో అయితే ఇలా కౌంగిలించుకుని మరీ చెపుతారు.
హిందీ నటుడు అయితేనే వెళ్లి కౌగిలించుకుంటావా అని సరదాగా నన్ను ఏడిపించారు అని రంభ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.








