గత కొద్ది రోజులుగా వైసిపి నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టిన జగన్ అనేక సంచలనాలకు కారణం అయ్యారు.ఓడిపోతారుకున్న జాబితాలో ఉన్న వారిలో తనను నమ్ముకున్న వారిని సైతం ఇప్పుడు పక్కన పెట్టారు.
కచ్చితంగా వచ్చి ఎన్నికల్లో గెలుస్తారు అనుకున్న వారికి మాత్రమే టిక్కెట్లను కేటాయిస్తున్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లుగా అనేక సర్వేల ద్వారా తెలుసుకున్న జగన్( CM ys jagan ) , దానికి అనుగుణంగానే ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు.
మొదటి విడతలో 11 మంది , రెండవ విడతలో 38 స్థానాలకు ఇన్చార్జిలను ప్రకటించారు.ఈ మార్పులపై వైసీపీలో చాలా కలకలమే రేపింది.
ఈ అసంతృప్తి తోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.ఇంకా అనేకమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.
అయినా జగన్ మాత్రం వెళ్లేవారు వెళ్లని అన్న ధోరణితోనే ఉన్నారు.తనకు వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం.
అందుకే ఇంచార్జిలను తప్పించే ముందు వారిని పిలిచి వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారు.
సర్వే నివేదికలను వారి ముందు ఉంచుతున్నారు.ఎటువంటి మొహమాటం లేకుండా ఈ ప్రక్షాళనకు జగన్ తెర తీశారు.అయితే కొంతమంది నేతల విషయంలో మాత్రం జగన్ మొహమాటపడినట్లుగానే అర్థమవుతుంది.
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు, ఇప్పటికీ తనకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ .కీలకంగా ఉన్న నాయకులు విషయంలో జగన్ కాస్త మెతక వైఖరితోనే వ్యవహరించారు.ముఖ్యంగా ఓ ఆరుగురు కీలక నేతల విషయంలో జగన్ రాజీ పడ్డట్టే అర్థమవుతుంది.తిరుపతి నియోజకవర్గంలో నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని తప్పించి, ఆయన తనయుడు అభినయ రెడ్డి( Bhumana Abhinay Reddy )ని ఇన్చార్జిగా నియమించారు.
అలాగే అదే జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించారు.ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.గుంటూరు లో ముస్తఫా ను తప్పించి ఆయన కుమార్తె నూర్ ఫాతిమా( Noor phathima )కు అవకాశం ఇచ్చారు.మచిలీపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని ని తప్పించి ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి అవకాశం ఇచ్చారు.
పోలవరం ఎమ్మెల్యే బాలరాజును తప్పించినా ఆయన సతీమణి రాజ్యలక్ష్మి కి బాధ్యతలు అప్పగించారు.ఈ సీనియర్ నాయకులంతా తమ వారసులకు,కుటుంబ సబ్యులకు టిక్కెట్ ఇవ్వాలని జగన్ ను కోరడంతోనే ఈ కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
మిగతా వారి విషయంలో ఎలా ఉన్నా కొంతమంది కీలక నేతలు విషయంలో జగన్ కాదనలేకపోయారు.