విజయనగరం జిల్లాలో ‘నిజం గెలవాలి’ పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి యాత్ర కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె 23వ డివిజన్ లో పర్యటించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త అప్పారావు ఇంటికి నారా భువనేశ్వరి వెళ్లారు.ఈ క్రమంలో మృతుని కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి వారికి టీడీపీ తరపున ఆర్థికసాయం అందజేశారు.అలాగే అప్పారావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.