కాసేపట్లో సీఎం జగన్ నివాసానికి వైఎస్ షర్మిల..!!

ఏపీ సీఎం జగన్ నివాసానికి మరికాసేపటిలో వైఎస్ షర్మిల వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు బ్రదర్ అనిల్ చేరుకున్నారు.

 Soon Ys Sharmila Will Visit Cm Jagan's Residence..!!-TeluguStop.com

మరికాసేపటిలో షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు రానున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నారు షర్మిల.సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ కు షర్మిల పెళ్లి పత్రిక ఇవ్వనున్నారు.తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్ ను షర్మిల ఆహ్వానించనున్నారు.జగన్ ను ఆహ్వానించిన తరువాత షర్మిల ఢిల్లీకి బయలుదేరనున్నారు.రేపు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో షర్మిల హస్తం గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎయిర్ పోర్టులో బ్రదర్ అనిల్ ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube