ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని చెప్పారు.
కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు.అయితే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని సీఎం జగన్ తెలిపారు.
ఈ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం తనకు చేతకాదని చెప్పారు.
తాను నమ్ముకున్నది దేవుడు, ప్రజలను మాత్రమేనని తెలిపారు.

అవినీతి జరగకపోయినా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.చంద్రబాబు అవినీతి చేసినా పవన్ కల్యాణ్ నోరు మెదపరని విమర్శించారు.చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కుడా భాగస్వామేనని తెలిపారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు సున్నా అని చెప్పారు.పవన్ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్న ఆయన కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు( Chandrababu Naidu ) మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష కూడా లేదని చెప్పారు.
గతంలో రైతుభరోసా, చేయూత, ఆసరా పథకాలు లేవని విమర్శించారు.







