గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది ఏకంగా సంక్రాంతి కానుకగా ఐదు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగిల్, నా సామిరంగ సినిమాలు ( Guntur Karam, Hanuman, Saindhav, Eagle, Na Samiranga )థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
ఏదైనా ఒక సినిమాలు 10వ తేదీ లేదా 11వ తేదీని ఎంచుకుంటే ఆ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.అయితే టాక్ నెగిటివ్ గా వస్తే సమస్య అని భావించి ఏ సినిమా అలాంటి రిస్క్ తీసుకోవడం లేదు.
సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలలో భారీ అంచనాలు ఏర్పడిన సినిమా గుంటూరు కారం కాగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది.
నైజాం ఏరియాలో దిల్ రాజు ( dil raju )ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్లకు దగ్గరగా ఈ సినిమా కలెక్షన్లు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు.

హనుమాన్ సినిమా థియేట్రికల్ హక్కులు 23 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడవగా విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలు లాభాల్లో ఉన్నారు.టాక్ ఏ మాత్రం అనుకూలంగా ఉన్నా హనుమాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.ఈ సినిమాలో తేజ సజ్జా( Teja Sajja ) సూపర్ హీరోగా కనిపించనున్నారు.
సైంధవ్, ఈగిల్, నా సామిరంగ సినిమాలపై కూడా వేర్వేరుగా 25 కోట్ల రూపాయల భారం ఉంది.

సంక్రాంతికి రిలీజ్ కానున్న అన్ని సినిమాలకు 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా ఈ సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.సంక్రాంతి సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడనున్నాయి.సలార్ మూవీ కూడా పరిమిత సంఖ్యలో థియేటర్లలో సంక్రాంతి వరకు ప్రదర్శితమయ్యే ఛాన్స్ ఉంది.







