ఏపీలో రేపటి నుంచి టీడీపీ కార్యక్రమాలు..!!

ఏపీలో రేపటి నుంచి ‘రా కదలి రా! ’ పేరుతో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించనుంది.ఈ మేరకు టీడీపీ – జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ జరిగింది.

 Tdp Programs In Ap From Tomorrow..!!-TeluguStop.com

సైకిల్ – గాజు గ్లాసుతో కూడిన లోగోను టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు సర్పంచులు, ఎల్లుండి జయహో బీసీ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈనెల 5వ తేదీ నుంచి 29 వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలు జరుగుతాయని పేర్కొన్నారు.ఈ మేరకు 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభను నిర్వహించనున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.టీడీపీ – జనసేన ఆధ్వర్యంలోనే అన్ని సభలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు , పవన్ కలిసి పాల్గొనే సభల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube