ఏపీలో రేపటి నుంచి టీడీపీ కార్యక్రమాలు..!!
TeluguStop.com
ఏపీలో రేపటి నుంచి ‘రా కదలి రా! ’ పేరుతో టీడీపీ కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఈ మేరకు టీడీపీ - జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ జరిగింది.
సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు సర్పంచులు, ఎల్లుండి జయహో బీసీ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈనెల 5వ తేదీ నుంచి 29 వరకు తమ పార్టీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఈ మేరకు 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు ఏర్పాటు చేయనున్నారు.
అలాగే 18వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభను నిర్వహించనున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
టీడీపీ - జనసేన ఆధ్వర్యంలోనే అన్ని సభలు జరుగుతాయని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే చంద్రబాబు , పవన్ కలిసి పాల్గొనే సభల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
షాకిచ్చిన ట్రంప్ .. ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జిన్‌పింగ్‌కి ఆహ్వానం?