బిగ్ బాస్ (Bigg Boss) కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు శివాజీ( Sivaji ) ఒకరు.సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా హీరోగా కొనసాగినటువంటి శివాజీ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమయ్యారు.అయితే ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరింత మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి కాగానే ఈయన హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి మాట్లాడుతూ ప్రశాంత్ చాలా మంచోడని అమాయకుడని తనకు ఏమీ తెలియదని చెప్పారు.ఇక ఈయనకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.అయితే తనకు యూట్యూబ్ ఛానల్ ని మానిటైజ్ చేసుకోవడం తెలియక నెలకు దాదాపు పది లక్షల రూపాయల వరకు డబ్బు కోల్పోయాడని నేనే మానిటైజ్ చేసి ఇచ్చానంటూ శివాజీ తెలిపారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో తన రెమ్యూనరేషన్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తనకు విన్నర్ కంటే ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ (Remuneration )వచ్చిందని తెలిపారు.

పల్లవి ప్రశాంత్ వారానికి లక్షల్లో పై రెమ్యూనరేషన్ తీసుకున్నారు.ఇక ఈయన గెలిచిన తర్వాత ప్రైజ్ మనీతో పాటు మరో రెండు బహుమతులు కూడా వచ్చాయి.ఇలా గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీలో ఎక్కువ భాగం టాక్స్ రూపంలోనే కట్ చేసుకుంటారు అయితే శివాజీ మాత్రం వారానికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున దాదాపు 60 లక్షల రూపాయల వరకు గెలుచుకున్నారని తెలుస్తోంది.
అయితే ఈయన ఖచ్చితమైనటువంటి ఫిగర్ చెప్పకపోయినా తానే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాను అంటూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







