కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎంతో మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లడం లేదా రిసార్ట్ లో ఘనంగా ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు.అయితే సెలబ్రిటీల అందరిలో కల్లా నటి సాయి పల్లవి ( Sai pallavi ) కాస్త భిన్నం అనే సంగతి మనకు తెలిసిందే.
ఈమె సినిమాల పరంగా గాని వ్యక్తిగతంగా కూడా ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.

ఇక న్యూ ఇయర్ ( New year ) సందర్భంగా సాయి పల్లవి కూడా కొత్త సంవత్సరపు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.అయితే ఈమె ఆధ్యాత్మిక పద్ధతిలో ఈ వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది.తన తల్లిదండ్రులు పుట్టపర్తి సాయిబాబానను మొక్కడం వల్లే తాను పుట్టానని అందుకే నాకు సాయి పల్లవి అనే పేరును పెట్టారు అంటూ గతంలో ఒకసారి సాయి పల్లవి చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి సాయిబాబా ( Puttaparthi sai baba ) మందిరంలో ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.

సాంప్రదాయబద్ధంగా పట్టుచీర కట్టుకొని బాబా నామస్మరణలతో ఈమె బాబా మందిరంలో సేవలలో పాల్గొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.అయితే గత ఏడాది కూడా ఈమె ఇలాగే పుట్టపర్తి సాయిబాబా మందిరానికి వెళ్లి కొత్త సంవత్సరపు వేడుకలను జరుపుకున్నారు.ఇలా ఈ ఏడాది కూడా ఈమె పుట్టపర్తిలో జరుపుకోవడంతో ఈమె సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya ) హీరోగా చందుమొండేటి ( Chandu mondeti ) దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి తండేల్ (Thandel) సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.