ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections in AP ) రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
దీనిపై రాష్ట్ర ప్రతిపక్ష నేతలు ఇష్టారీతిన కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.షర్మిల రాకతో సీఎం జగన్ భయపడుతున్నారని, వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారని ఊదరగొడుతున్నారు.
అయితే అదంతా ప్రతిపక్షాలు తమ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ పై విమర్శలు చేస్తున్నారని పలువురు అంటున్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో గెలవాలని భావించే చంద్రబాబు( Chandrababu ) ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని ఏపీ వాసులు సైతం భావిస్తున్నారట.
కానీ 35 ఐదేళ్ల వయసులోనే కాంగ్రెస్ ను ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి జగన్.ఆ సమయంలో అత్యంత బలమైన నేతగా పేరొందిన సోనియాగాంధీ పేషీ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయకపోగా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవిని సైతం తృణప్రాయంగా జగన్( jagan ) వదులుకున్నారు.
తరువాత సీబీఐ పేరిట కాంగ్రెస్ దాడులు చేయించినా ఏనాడూ పట్టించుకోలేదు.ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా ధైర్యంగానే ఎదుర్కొన్నారు తప్ప పిరికివాడిలా ఏనాడూ పారిపోలేదు.హస్తం పార్టీకి లొంగలేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

2014లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా జగన్ బెదిరిపోలేదు.జాతీయ రాజకీయాల్లో పేరొందిన కాంగ్రెస్ ను ఎదిరించి బరిలో నిలిచిన జగన్ ఇప్పుడు షర్మిల వస్తే తనకు నష్టం కలుగుతుందని టీడీపీ నేతలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.అదికాక షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కొన్ని ఓట్లను సాధిస్తే అది టీడీపీకే నష్టం కానీ జగన్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదని వైసీపీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారని తెలుస్తోంది.

సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే అంతగా వ్యతిరేక ఓటు చీలుతుందన్న విషయం తెలిసిందే.దీని వలన ప్రభుత్వం తక్కువగా నష్టపోతుంది.ఈ నేపథ్యంలో షర్మిల కనుక కాంగ్రెస్ లో చేరితే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలుతాయో తప్ప జగన్ కు ఎటువంటి నష్టం ఉండదని అంటున్నారు.వ్యతిరేక ఓట్లు అన్నీ టీడీపీ, జనసేన, ఇతర పార్టీలకు రావాలి.
కానీ షర్మిల కూడా వ్యతిరేక ఓట్లలో భాగం కావడం వలన టీడీపీకే నష్టం వాటిల్లుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని టీడీపీ వాళ్లు జగన్ కు నష్టమని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన మరియు బీజేపీలు పొత్తులతో ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.అయితే ఎంతమంది కలిసొచ్చినా వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నాలుగున్నరేళ్ల పాలన కాలంలో జగన్ ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు మరోసారి అధికార పీఠాన్ని కట్టబెడతాయని చెబుతున్నారు.