హైదరాబాద్ లోని నాంపల్లిలో నుమాయిష్ ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు.
ఇవాళ ప్రారంభంకానున్న ఈ ఎగ్జిబిషన్ వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది.కాగా ఈ సంవత్సరం మొత్తం 2500 స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని అధికారులు తెలిపారు.మరోవైపు నుమాయిష్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సైతం అమలు కానున్నాయి.
నాంపల్లి వైపుగా సాగే రాకపోకలను వివిధ మార్గాల్లోకి మళ్లించనున్నారు.ఈ క్రమంలోనే ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలు అవుతాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.







