పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లామర్ బ్యూటీ శృతి హాసన్( Shruti Haasan ) కాంబినేషన్ లో గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ సినిమాలు తెరకెక్కగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.పవన్, శృతి కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అని అభిమానులు సైతం భావిస్తారనే సంగతి తెలిసిందే.2023 సంవత్సరంలో శృతి హాసన్ ఏకంగా నాలుగు హిట్లను ఖాతాలో వేసుకున్నారు.
2023లో శృతి నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్, సాయితేజ్, తరుణ్ భాస్కర్, శ్రియా రెడ్డి, శోభు యార్లగడ్డ పాల్గొనగా శృతి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మాట్లాడుతూ పవన్ కు లెగో బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉందని ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు.ఆ కామెంట్ల గురించి సాయితేజ్( Saitej ) సైతం స్పందించారు.

మా చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి లెగోస్ ఆడుకునేవారని లెగోస్ ఆడదామని ఆయనే మమ్మల్ని పిలిచేవారని సాయితేజ్ కామెంట్లు చేశారు.నేను ఎప్పుడైనా లెగోస్ ను( Legos ) కొనుగోలు చేస్తే పవన్ మావయ్యకు కూడా ఒక సెట్ తీసుకుంటానని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సమయంలో ఆయనకు లెగోస్ కొనుగోలు చేయాలని మా అమ్మ డబ్బులు ఇచ్చిందని సాయితేజ్ పేర్కొన్నారు.

సాయితేజ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగ తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండగా ఈ ఏడాది జూన్ నుంచి పవన్ సినిమాల షూటింగ్ తో బిజీ కానున్నారు.ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా పవన్ కెరీర్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.
ఓజీ సినిమా కోసం పవన్ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







