పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజి ( OG )అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా దాదాపు 50% వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలలో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా గురించి నటి శ్రియా రెడ్డి ( Sriya Reddy ) చేసినటువంటి కామెంట్ లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈమె ఇటీవల సలార్ (Salaar) సినిమాలో రాధా రామ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఎంతో అద్భుతమైనటువంటి నటనను కనబరిచినటువంటి ఈమె ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా గురించి మాట్లాడారు .ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు.ఇక ఈ పాత్ర చేసిన తర్వాత ఇప్పటికే సినిమాలలో రిటైర్డ్ అయిపోతే చాలు అన్న భావన నాకు కలిగింది అని తెలిపారు.
ఈ సినిమా సలార్ సినిమా కంటే పది రెట్లు అద్భుతంగా ఉండబోతుంది అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సలార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలాంటి సినిమా కంటే పది రెట్లు ఓజీ బాగుంటుందంటూ ఈమె చేసినటువంటి కామెంట్లు సినిమాపై ఆసక్తిని కలిగించడమే కాకుండా ఇప్పటికిప్పుడే ఈ సినిమా చూసేయాలి అన్న భావన ప్రతి ఒక్కరికి కలిగేలా ఉన్నాయి.
ఈమె వ్యాఖ్యలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి.