కొంతమంది కుక్కలను( Dogs ) కిరాతకంగా హింసించి చంపేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఈ మూగజీవులకు ఫుడ్ పెడుతూ చేరదీస్తున్నారు.మానవత్వం ఇంకా మిగిలే ఉందని వీరు నిరూపిస్తున్నారు.
వీధి కుక్కలకు ఆహారం పెడుతూ వాటి జీవితాల్లో వెలుగులు నింపుతున్న చాలామంది ప్రజలు ఇప్పటికే వెలుగులోకి వచ్చారు.తాజాగా ఇలాంటి డాగ్ లవర్ మరొకరు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
నీయల్ హార్బీసన్ అనే పేరు ఈ డాగ్ లవర్ థాయిలాండ్ లో నివసిస్తున్నారు.తన నివాసానికి దగ్గరలో ఉన్న 80 వీధి కుక్కలకు తను రోజూ ఆహారం పెడుతున్నారు.
అతనితో పాటు కలిసి పని చేసే వాలంటీర్స్ డైలీ 800 కుక్కలకు ఫుడ్ అందిస్తున్నారు.
తాను మాత్రం స్పెషల్ గా 80 కుక్కలకు డైలీ ఫుడ్ పెడుతున్నట్లు నీయల్ హార్బీసన్( Niall Harbison ) తాజాగా వెల్లడించారు.కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే తన స్కూటర్ రాకను ఈ కుక్కలు పసిగడతాయని ఆయన పేర్కొన్నారు.అంతేకాదు ఈ కుక్కలకు ఫుడ్ పెడుతున్న ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది.వైరల్ ట్రిప్ ఓపెన్ చేస్తే మనం నీయల్ హార్బీసన్ ఒక స్కూటర్ మీద రావడం చూడవచ్చు.
ఆ స్కూటర్ సౌండ్ విని చాలా వీధి కుక్కలు రోడ్డుపైకి వచ్చాయి.తర్వాత తమకు ఫుడ్ పెడుతున్న వ్యక్తి పైన ఎంతో ప్రేమ కురిపించాయి.
చాలా ఉత్సాహంగా అతడి ముందు గెంతుతూ కనిపించాయి.తర్వాత నీయల్ కుక్కలకు, వాటి పిల్లలకు ఆహారం పెట్టడం మనం చూడవచ్చు.
అది ఎంతో ఆనందంగా కడుపు నింపుకొని తమకు ఆహారం పెడుతున్న నీయల్పై అన్‌కండీషనల్ లవ్ కురిపించాయి.
ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు అతడిని పొగుడుతున్నారు.మూగజీవులను ఆదుకుంటున్న మీలాంటి వ్యక్తులకు దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని, చల్లగా బతకాలని కోరుకుంటున్నట్లు మరికొందరు తెలిపారు.సాధారణంగా కుక్కలు ఎక్కువగా పుట్టడం వల్ల వాటికి ఆహారం కొరత ఏర్పడుతుంది.
ఆల్రెడీ ఈ ప్రపంచంలో ఉన్న కుక్కలకి సరిగా ఆహారం దొరకడం లేదు.కొత్తగా పుట్టి ఈ లోకంలో బాధలు పడే కంటే అవి పుట్టకపోవడమే నయమని చాలామంది భావిస్తున్నారు.
అందుకే నీయల్ హార్బీసన్ కూడా చాలా కుక్కలను స్టెరిలైజ్ చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.