2023 వ సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్టుగా మిగిలితే మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ లు అయ్యాయి.ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దాని వెనక ఆ టీం యొక్క కష్టం అనేది ఉంటుంది అలాగే ఒక సినిమా ప్లాప్ అయిందంటే కూడా ఆ సినిమా యొక్క టీమ్ పడిన కష్టం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది.అందువల్లే ఒక సినిమా సక్సెస్ అయిన ఫెయిల్ అయిన డైరెక్టర్ తో పాటు ఉండే ఆ టీం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది…

అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయి మంచి విజయం సాధించిన బేబీ ( Baby Movie ) లాంటి సినిమా తో దర్శకుడు సాయిరాజేష్( Director Sai Rajesh ) మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ కి ( Anand Devarakonda ) కూడా ఈ సినిమా ద్వారా మరొక మంచి సక్సెస్ దక్కిందనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమం లోనే బేబీ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆనంద్ దేవరకొండ కూడా సూపర్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుసగా స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేసే అవకాశాలను పొందుతున్నాడు.

నిజానికి ఆనంద్ దేవరకొండ వాళ్ల అన్నయ్య అయిన విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లా స్టార్ హీరో అవ్వకపొయిన కూడా తనకంటూ యూత్ మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు…విజయ్ దేవరకొండ తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ ఇప్పుడు సంతోష్ శోభన్ తో( Santosh Sobhan ) ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మళ్ళీ ఆనంద్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…








