డిసెంబర్ 31 సాయంత్రం నుండి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ జిల్లా పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోనేందుకు పలుసూచనలు చేస్తూ జిల్లా ఎస్పీ శనివారం రోజున ప్రకటన విడుదల చేసారు.డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా జిల్లా పరిధిలోని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో,గ్రామాల్లో పెట్రోలింగ్‌ ,డ్రంక్ డ్రైవ్ లు ముమ్మరంగా నిర్వహిచండం జరుగుతుందని ,ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి వుంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

 Drunk And Drive Checks Across Sircilla District From December 31 Evening, Drunk-TeluguStop.com

డిసెంబర్ 31నాడు రాత్రి తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి భద్రత, ప్రమాద నష్టనివారణ దృష్ట్యా పోలీసు వారు చేయు సూచనలు.మైనర్, యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వరాదు పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున అధిక వేగంతో వాహనాలు నడుపరాదు.మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల గురించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది.

అధిక శబ్దాలను చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడుపరాదు అది మీ ప్రాణాలకే ప్రమాదం.గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం మరియు వాహనాలతో ర్యాలిగా వెళ్లడం చేయరాదు.

రోడ్లపై టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.

డీజే లు నిషేధించడం జరిగింది.

నిబంధనలకు విరుద్ధంగా డీజే లు వాడినట్లు అయితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాత్రి సమయాల్లో త్రిబుల్ రైడింగ్ , సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడుపుతూ శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు.

బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధించబడింది బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు రక్షణ చర్యలకు ప్రజలు,సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ, ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube