బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే రేటింగ్ ఎంతో తెలుసా.. రికార్డు స్థాయిలో రేటింగ్?

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ఈనెల 17వ తేదీ పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే.19 మంది కంటెస్టెంట్లతో కొనసాగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయింది.అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి మేకర్ సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త టాస్కులతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

 Bigg Boss Telugu 7 Grand Finale Record Rating, Bigg Boss, Nagarjuna, Grand Final-TeluguStop.com

ఇక ఈ సీజన్ విన్నర్ గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలవడం విశేషం.

Telugu Bigg Boss, Grand Finale, Nagarjuna, Shivaji, Tollywood-Movie

ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొన్నటువంటి ఈ షోలో వారందరినీ కాదని కామన్ మ్యాన్ కు టైటిల్ రావడం విశేషం అని చెప్పాలి మొదటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) టైటిల్ విన్నర్ అని వార్తలు వచ్చాయి.దీంతో ఫినాలే ఎపిసోడ్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.దీంతో గ్రాండ్ ఫినాలే (Grand Finale) ఎపిసోడ్ పై అందరి ఆసక్తి ఉందని చెప్పాలి.

ఇకపోతే ఇటీవల మేకర్స్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టివిఆర్ రేటింగ్ విడుదల చేశారు.

Telugu Bigg Boss, Grand Finale, Nagarjuna, Shivaji, Tollywood-Movie

ఇదివరకు ఏ సీజన్ గ్రాండ్ ఫినాలే కి రాని విధంగా ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే రేటింగ్ సొంతం చేసుకొని రికార్డ్ స్థాయిలో రేటింగ్ సంపాదించిందని చెప్పాలి.బిగ్ బాస్ సీజన్ 7టివిఆర్ రేటింగ్ ఏకంగా 21.7 రేటింగ్ సాధించి సంచలనాలను సృష్టించింది.ఒక బుల్లితెర షో కి ఈ స్థాయిలో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇలా గ్రాండ్ ఫినాలే రోజు భారీ స్థాయిలో రేటింగ్ రావడంతో నిర్వాహకులు మరొక షోని తొందరలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఓటిటి షో చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ షో ఫిబ్రవరిలోనే ప్రారంభించాలన్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube